2024 తర్వాత జన గణన ఉండదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 9 May 2022

2024 తర్వాత జన గణన ఉండదు


పదేళ్లకోసారి నిర్వహించే జన గణన 2024 తర్వాత ఉండదట!. 2024 తర్వాత జన గణనను ప్రత్యేకించి చేపట్టాల్సిన అవసరం లేదని అస్సాం పర్యటనలో వున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జనన, మరణ రిజిస్టర్ల రేటును జన గణనకు జత చేస్తామని, 2024లోగా ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాటును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత దేశంలో నమోదయ్యే జననాలతో పాటు మరణాలు కూడా ఆటోమేటిక్‌గా జన గణనకు జత అవుతుంటాయని తెలిపారు. అంతేకాకుండా ఆయా వ్యక్తుల వయసు 18 నిండగానే వారి పేర్లు ఆటోమేటిక్‌గా ఓటర్ల జాబితాలో చేరిపోతాయని కూడా ఆయన చెప్పారు. తాజాగా చేపట్టనున్న జన గణనలో ఈ తరహా మార్పులన్నీచేస్తున్నామని చెప్పిన అమిత్ షా. ఈ-సెన్సస్ లో అందరికంటే ముందు తన కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకుంటానని ప్రకటించారు.

No comments:

Post a Comment