బ్రెడ్‌, బిస్కెట్‌ ధరలు పెరగనున్నాయి ?

Telugu Lo Computer
0


బ్రెడ్, బిస్కెట్లు, పిండి ధరలు  త్వరలో కూడా పెరిగే అవకాశం ఉంది. 2022 సంవత్సరం ప్రారంభం నుండి రేట్లు 46 శాతం పెరిగాయి. ఇప్పటి వరకు గోధుమ ధరలు 46 శాతం పెరిగాయి. ప్రస్తుతం, గోధుమలు మార్కెట్‌లో ఎఎస్పీ కంటే 20 శాతం ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఎఫ్‌సీఐ గోధుమల కోసం ఓఎంఎస్ఎస్‌ను ప్రకటించలేదు. దీంతో కన్జూమర్లు కంపెనీలు వీటి ధరలు మరింత పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. వీటి ధరలు జూన్‌ నుంచి పెంచే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. వర్షాకాలం సమీపిస్తుండటంతో స్నాక్స్ వంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్‌లో విద్యాసంస్థలు కూడా తెరుచుకుంటాయి. బ్రెడ్, బిస్కెట్ వంటి స్నాక్స్ ఐటమ్స్‌కు డిమాండ్ పెరుగుతున్నందున ధరలు పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం ప్రభుత్వం నుంచి గోధుమలు ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ 70 లక్షల టన్నుల గోధుమలను సేకరించింది. ఇప్పటి వరకు ఓఎంఎస్ఎస్‌పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. కంపెనీలు ధరలను పెంచనున్నాయి. గోధుమల ధరల పెరుగుదల కారణంగా బ్రెడ్, బిస్కెట్లు, బన్స్ వంటి పిండితో తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల ధరలలో 10 నుండి 15 శాతం పెరుగుదల ఉండవచ్చని వ్యాపారవేత్తలు భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)