వైసీపీలో రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 29 April 2022

వైసీపీలో రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు


వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. రెడ్లు లేకపోతే తాను గెలవలేనని చెప్పారు. వర్గపోరుకు రెడ్లు స్వస్తి పలకాలని నారాయణస్వామి కోరారు. ఇటీవల కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో నారాయణస్వామికి మరోసారి చోటుదక్కింది. గతంలో ఆయనకు ఉన్న డిప్యూటీ సీఎం పదవిని సీఎం జగన్ మరోసారి కొనసాగించారు.  దేవుళ్లలో ఉండే లక్షణాలు సీఎం జగన్‌లో ఉన్నాయని.. అందుకే తనకు రెండోసారి డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ పరిణామాన్ని తాను అసలు ఊహించలేదన్నారు. అందుకే జగన్ ఫొటోతో బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించారు.

No comments:

Post a Comment