మా ఎంపీ, ఎమ్మెల్యే కనిపించడం లేదు !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దువార్‌లో స్థానిక బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన జాన్‌ బార్లా, ఫలకటా ఎమ్మెల్యే దీపక్‌ బర్మన్‌ కనిపించడం లేదంటూ పోస్టర్లు అంటించారు. వారిద్దరిని వెతికి పెట్టాలని పోలీస్‌ స్టేషన్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు మిస్సింగ్‌ ఫిర్యాదు ఇచ్చారు. తుఫాన్‌ కారణంగా అలీపూర్‌దువార్‌లో భారీ నష్టం జరిగింది. ఇంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తమను పరామర్శించలేదని, కనీసం ఇటువైపు కూడా రాలేదని టీఎంసీ నేతలు ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)