ప్రమాదంలో పడి లోయలోకి జారిపోకూడదు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 11 April 2022

ప్రమాదంలో పడి లోయలోకి జారిపోకూడదు !


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే  ఆనంద్ మహీంద్రా టాలెంట్ ఎక్కడ కనిపించినా ప్రోత్సహిస్తుంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు,పెట్టే వీడియోలు చాలా జీవితాల్లో వెలుగులను కూడా నింపాయి. ఆయన పోస్ట్ లు ఎప్పుడూ ఆశక్తికరమైనవిగా, సందేశాత్మకంగా, సమాజాన్ని ఆలోచింపజేసేవిగా ఉంటుంటాయి. అయితే తాజాగా ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. తన మండే మోటివేషన్ పోస్టుల్లో భాగంగా ఆయన సోవామరం ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఆ సందర్భంగా విలువ కట్టలేని ఓ సందేశాన్నికూడా ఆయన ఇచ్చారు. "ఒక్కోసారి సోమవారం ఉదయం ప్రమాదకరంగా అనిపించవచ్చు. కానీ మీరు వారమంతా గడిచేలా చెయ్యగలగాలి. ప్రమాదంలో పడి లోయలోకి జారిపోకూడదు" అనే క్యాప్షన్ తో  తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని జోహార్ లోయ ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశంలో సన్నటి ఘాట్ రోడ్డుపై ఓ ట్రక్ లాంటి వాహనం వెళ్తోంది. అందులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా మిలామ్ నుంచి జోహార్ లోయకు వెళ్తున్నారు. ఆ రోడ్డు అంతా గుంతలు, గతుకులు. ఏమాత్రం తేడా వచ్చినా వాహనంతో సహా వారంతా లోయలో పడిపోయే పరిస్థితి.


అయినా సరే వారు తమ ప్రయాణం అలాగే సాగించారు. ఈ వీడియోని 2020లో ఫేస్‌ బుక్‌ లో శుభయాత్ర పేరుతో ఉన్న అకౌంట్‌ లో పోస్ట్ చేశారు. దీనిని ఇప్పుడు ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో మళ్లీ పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది థ్రిల్ కలిగిస్తోందని అంటుంటే... మరికొందరు ఇలా వెళ్లకూడదు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఫొటోషాప్‌ లా ఉంది... నిజంలా కనిపించట్లేదని మరో యూజర్ కామెంట్ చేశారు. కాగా, ఇటీవల చాలా మంది ప్రముఖులు..ఇతరులు ఎప్పుడో అప్‌లోడ్ చేసిన వీడియోలను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు,సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్‌లో మరో రికార్డు బ్రేక్‌ చేశారు. ఉగాది పండుగ రోజున ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు క్రాస్‌ చేసింది. ఈ విషయాన్ని ఓ ఫాలోవర్‌ ఆనంద్‌ మహీంద్రాకి గుర్తు చేయగా... నా ఫాలోవర్ల సంఖ్యకు గమనించిందుకు కృతజ్ఞతలు. పండగ రోజున ఈ ఘనత సాధించిందుకు ఆనందంగా ఉందంటూ ఆయన బదులిచ్చారు.

No comments:

Post a Comment