వేసవిలో కోడిగుడ్లు తినకూడదా ?

Telugu Lo Computer
0


కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం.  దీనిలో అన్ని పోషకాలుంటాయి.  వేసవిలో  కోడిగుడ్లు తినకూడదనేది ఒక అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. కోడిగుడ్లు తినడం వల్ల వేడి పెరుగుతుందనేది వాస్తవమే అయినప్పటికీ.. రోజుకు రెండు గుడ్లను తింటే ఒంట్లో వేడి ఏమీ పెరగదంటు న్నారు. గుడ్డు కర్రీ, ఉడకబెట్టిన గుడ్లు, ఎగ్ ఆమ్లెట్, చీట్ ఆమ్లెట్ ఇలా గుడ్డుతో ఏది చేసినా చాలా మంది ఇష్టంగా తింటారు. గుడ్డులో విటమిన్ బి, విటమిన్ డి, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు, సల్ఫర్ ఆరోగ్యంగా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. తినకూడదు అనే దాని వెనుక ఎటువంటి శాస్త్రీయత లేదు. వేసవిలో గుడ్లకు దూరంగా ఉండాలనేది అపోహ మాత్రమే. కొన్ని ఆహారాలు శరీరానికి చలవనిచ్చేవి వుంటే, మరికొన్ని వేడిగా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, దేన్నైనా మితంగా తీసుకోవడం మంచిది. ఈ ఎండాకాలంలో రోజుకు రెండు గుడ్లను తింటే ఒంట్లో వేడి ఏమీ పెరగదట. రెండు కంటే ఎక్కువ గుడ్లను తింటేనే ఒంట్లో వేడి ఎక్కువవుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎంచక్కా రోజుకు రెండు గుడ్లను తినండి. అప్పుడే ఈ ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. గుడ్లను తినడం వల్ల మీ వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. గుడ్డును తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు ఎక్కువగా ఫుడ్ ను తీసుకోలేరు.ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే వేసవిలో సహజంగానే ఆకలి ఎక్కువ అవుతుంది. ఎండ వేడిమికి శరీరానికి చమట పడుతుంది.. దాంతో త్వరగా నీరసం వచ్చి ఆకలి అనిపిస్తుంది.. ఏమైనా తినాలని అనిపిస్తుంది.. గుడ్డు తింటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.. ఆకలి తగ్గుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)