ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప‍్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు. ఈ కేసులో నిహారికను విచారించిన తర్వాత ఆమెకు నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. పబ్ విషయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పబ్‌పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. అయితే, పబ్ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో పోలీసుల చూడనట్టు వదిలేశారని తెలుస్తోంది. ఈ కేసులో సీఐ శివచంద్రను సస్పెండ్ చేసి ఏసీపీ సుదర్శన్‌కు ఛార్జ్ మెమోను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఫుడింగ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వాడినట్టు తెలిపారు. పబ్‌యాజమాన్యమే డ్రగ్స్ సప్లై చేసిందని స్పష్టం చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తే డ్రగ్స్ సప్లై చేసినట్టు అంగీకరించారు. ఆ హోటల్‌లో ఇంకా గాలింపు చర‍్యలు కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment