వేప ఆకు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


వేప చెట్టును ఆయుర్వేద నిధిగా భావిస్తారు. దాని ఆకులు, కాండం, పండ్లు, పువ్వులు అన్ని ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వేపలో అనేక ఔషధ గుణాలున్నాయి. వేప ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు. రోజూ ఉదయాన్నే 5 నుంచి 6 వేప ఆకులను నమిలితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఖాళీ కడుపుతో వేప ఆకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రక్త సమస్యతో బాధపడేవారు వేపతో తమ దినచర్యను ప్రారంభిస్తే రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మంలో సహజమైన మెరుపును పెంచడంలో వేప ఆకులు  బాగా సహాయపడుతాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులను కడిగి నమలండి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, ఖాళీ కడుపుతో వేప ఆకులను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ తదితర గుణాలు వున్నాయి. వీటి వల్ల శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్‌ల నుంచి బారి నుంచి రక్షించవచ్చు,

Post a Comment

0Comments

Post a Comment (0)