సైకిళ్లకు ఢిల్లీ సర్కార్ సబ్సిడీ !

Telugu Lo Computer
0


ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేసే దిశగా ఢిల్లీ గవర్నమెంట్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఈ-సైకిళ్లకు కూడా సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగా కొనుగోలు చేసిన 10వేల మంది కస్టమర్లకు రూ.5వేల 500 చొప్పున చెల్లించనున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా ముందుగా కొనుగోలు చేసిన 1000మంది కొనుగోలుదారులకు ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అదనంగా రూ.2వేలు సబ్సిడీ దక్కుతుందని ఢిల్లీ  రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ చెప్పారు.  దేశంలోనే ఈ-సైకిల్ కి రాయితీలు అందించే తొలి రాష్ట్రంగా ఢిల్లీ కి ఆ ఘనత దక్కింది.  భారీ కార్గో ఈ-సైకిళ్లు, వాణిజ్య అవసరాల కోసం ఇ-కార్ట్‌ల కొనుగోలుపై రాయితీని కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా మంత్రి తెలిపారు. ఈ ప్రకటనపై హీరో లెక్ట్రో సీఈవో ఆదిత్య ముంజాల్ స్పందిస్తూ, ఈవీ సబ్సిడీ విధానంలో ఈ-సైకిళ్లను చేర్చాలనే ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)