భారత్‌పై చైనా దాడులు చేయాలని చూస్తోంది

Telugu Lo Computer
0


లడాఖ్‌, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు భారత్‌లో భాగం కాదని చైనా వాదన అని, ఈ ప్రాంతాల్లో చైనా తన బలగాలను మోహరించిందని  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీఅన్నారు.  ఈ విషయాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని ఆరోపించారు. సత్యాలను అంగీకరించే మనస్తత్వం ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సత్యాన్ని పరిగణనలోకి తీసుకొని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాహుల్ హితవు పలికారు. కేంద్రం గనక పరిస్థితులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోని పక్షంలో పరిస్థితులు మళ్లీ మారే అవకాశాలున్నాయని రాహుల్ హెచ్చరించారు. చాలా సంవత్సరాలుగా బీజేపీ, ఆరెస్సెస్ దేశంలో జరుగుతున్న పరిస్థితులను నొక్కి పెడుతున్నాయని, అవి ఎప్పుడో ఒకప్పుడు బయటికి పొక్కడం మాత్రం ఖాయమని రాహుల్ అన్నారు. శ్రీలంకలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారని, ఇప్పుడు సత్యాలు బయటికి వచ్చాయన్నారు. అలాగే భారత్‌లో కూడా జరుగుతుందని రాహుల్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)