ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 April 2022

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన


ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గంకు చెందిన వారిలో  కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. తక్కువ ఇన్‌కమ్ గ్రూప్(ఎల్ఐజీ) కు చెందిన వాళ్లు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఆదాయం ఉంటే ఈ స్కీమ్ కు అర్హులు. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ 1 (ఎంఐజీ1) లబ్ధిదారులు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉంటే అర్హులు కాగా మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ 2 (ఎంఐజీ 2) లబ్ధిదారులు ఆదాయం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటే అర్హత కలిగి ఉంటారు. ఆదాయ రుజువు కార్డ్, అడ్రస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గృహా రుణాలపై వడ్డీ రాయితీలను అందించడం కేంద్రం ఈ స్కీమ్ ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. https://pmaymis.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో 'సిటిజన్ అసెస్‌మెంట్' అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఆధార్ వివరాలను ఎంటర్ చేసి క్యాప్చార్  కోడ్‌, ఇతర వివరాలను ధృవీకరించి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా ఈ స్కీమ్ కొరకు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు 2.67 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీ లభిస్తోంది.

No comments:

Post a Comment