నోయిడా స్కూల్ లో కరోనా కలకలం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 April 2022

నోయిడా స్కూల్ లో కరోనా కలకలం


నోయిడా లోని ఓ పాఠశాలలో 13 మంది విద్యార్థులకు, ముగ్గురు ఉపాధ్యాయులకు కొవిడ్ సోకింది. పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు జరిపిన రాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో 16 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మంగళవారం నుంచి ఈ నెల 18వతేదీ వరకు పాఠశాలలో ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా సోకిన పాఠశాలలో పూర్తిగా శానిటైజ్ చేయించారు.ఇంతకు ముందు ఘజియాబాద్ నగరంలోని ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కూడా కరోనా సోకడంతో ఆ పాఠశాలను ముందుజాగ్రత్తగా మూసివేశారు. కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలో కొవిడ్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కోరారు.

No comments:

Post a Comment