మార్చి నెల జీతాలు మరింత ఆలస్యం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల అమలు కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి రావడంలేదు.  ఉగాది పండుగ ఉన్న నేపథ్యంలో మార్చి జీతాలు తొందరగా పడి పోతాయని ఆశ పడ్డ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఇవాళ కూడా జీతాలు పడే ఛాన్స్‌ కనబడటం లేదు. జీతాల చెల్లింపు కోసం కొత్తగా తయారు చేసిన సాఫ్ట్‌ వేర్‌ పేరోల్‌ వెబ్‌ పని చేయక పోవడంతోనే జీతాలు చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ఆర్టీఐకు అనుసంధానం కాకపోవడంతో.. మళ్లీ పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్క ఈ నెల 7 వ తేదీ తర్వాతనే జీతాలు పడనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)