ప్రభాకర్ సెయిల్ మృతి

Telugu Lo Computer
0


ముంబయి నగర శివారు తీరప్రాంతంలోని క్రూజ్ నౌకలో జరుగుతోన్న రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు 2021 అక్టోబర్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆర్యన్ ఖాన్, మరికొంత మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్సీబీ కొందరిని సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి ఒకరు. గోసావికి ప్రభాకర్ సెయిల్ వ్యక్తిగత బాడీగార్డు. దీంతో ఎన్సీబీ ప్రభాకర్ సెయిల్ ను కూడా సాక్షిగా పేర్కొంది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో సాక్షిగా ఉన్న సెయిల్ దర్యాప్తు సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పటి జోనల్ డైరెక్టర్ వాఖండే, గోసావి మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందని, తనకు ప్రాణాపాయం పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎన్సీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న మరో వ్యక్తి శామ్ డిసౌజా.. గోసావి, సెయిల్ ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవటం కేసులో కీలక పరిణామంగా మారింది. ప్రభాకర్ తన నివాసంలో ఉన్నప్పుడే గుండెపోటు వచ్చిందని అతడి తరపున న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. ఇదిలాఉంటే ప్రభాకర్ మరణంపై కుటుంబ సభ్యులు స్పందించారు.. ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదు. ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చిందని, ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదని తుషార్ ఖండారే చెప్పారు. ప్రభాకర్ ముంబయిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సెయిల్ మరణంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)