జర్నలిస్ట్‌ కాళ్లకు బేడీలు వేసిన పోలీసులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 April 2022

జర్నలిస్ట్‌ కాళ్లకు బేడీలు వేసిన పోలీసులు !


ఒడిషాలోని బాలాసోర్ లో జర్నలిస్టుగా పని చేసే లోక్ నాథ్ దలేహ్, నీలగిరి పోలీసు స్టేషన్ ప్రాతంలో జరిగిన ఒక అవినీతి గురించి వార్త రాశాడు. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిపై కక్ష కట్టినట్లు తెలుస్తోంది. మొబైల్ తీసుకు వెళ్లేందుకు స్టేషన్‌కు రమ్మని చెప్పి అక్కడకు వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ ద్రౌపది దాస్ తనపై దాడి చేసాడని జర్నలిస్ట్ తెలిపాడు. ఎస్.ఐ. కొట్టిన దెబ్బలకు కిందపడిపోయిన తనను ఆస్పత్రిలో చేర్పించి కాళ్ళకు బేడీలు వేసి ఆస్పత్రి బెడ్‌కు కట్టేశారని వివరించాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో డీజీపీ విచారణకు ఆదేశించారు. ఒడిషా మానవహక్కుల సంఘం ఈ ఘటననను సుమోటోగా స్వీకరించింది. 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని బాలాసోర్ ఐజీని ఆదేశించింది.

No comments:

Post a Comment