ఉప రాష్ట్రపతి పేరుతో నకిలీ మెసేజ్ లు

Telugu Lo Computer
0


భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరుతో వాట్సాప్ లలో మెసేజ్ లు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం వెంకయ్యనాయుడు వరకు వెళ్లడంతో దీనిపై ఆయన స్పందిచారు. తన పేరుతో వస్తున్న మెసేజ్ లకు స్పందించ వద్దంటూ సూచించారు. తన పేరుతో సహాయం, ఆర్థిక సహాయం కోరుతూ వాట్సాప్ మెసేజ్ లు వస్తే ప్రజలు పట్టించుకోవద్దన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఉపరాష్ట్రపతి కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఒక అధికారిక ప్రకటనలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరుతో మొబైల్ నెంబర్ 9439073183 నుంచి సాయం చేయాలంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పంపిస్తున్నారని..వాటికి స్పందించవద్దని సూచించారు. మరిన్ని నెంబర్ల నుంచి నకిలీ మెసేజ్ లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)