చండీగఢ్‌ జైలు ఆవరణలో బాంబు

Telugu Lo Computer
0


చండీగఢ్‌లోని బురైల్‌ జైలు వద్ద భారీ ప్రమాదం తప్పింది. బురైల్‌ జైలు ఆవరణలో డిటోనేటర్‌ బయటపడింది. దీనిని ఎన్‌ఎస్జీ బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ నిర్వీర్యం చేశారు. శనివారం రాత్రి జైలు బయటి గోడ వద్ద పోలీసులు ఓ అనుమానిత సంచిని గుర్తించారు. దానిని పరిశీలించగా అందులో డిటోనేటర్‌, దాని పక్కన కాలిపోయిన కోడ్‌ఎక్స్‌ వైర్‌ ఉన్నది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిషేధించి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు. శనివారం ఉదయం రంగంలోకి దిగిన ఎన్‌ఎస్జీ బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ దానిని నిర్వీర్యం చేసింది. అయితే, అందులో ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఏ రకమైనవి అనేది ఇంకా తెలియరాలేదని, దానిని సైన్యం మాత్రమే నిర్ధారిస్తుందని చండీగఢ్‌ ఎస్‌ఎస్పీ కుల్దీప్‌ చాహల్‌ తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యా లేదా జైలును బద్దలు కొట్టేందుకు చేసిన ప్రయత్నమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే విషయం దర్యాప్తులో తేలుతుందని అధికారులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)