నిజమైన న్యాయం ప్రమాదంలో పడకూడదు !

Telugu Lo Computer
0


చెన్నైలోని మద్రాసు హైకోర్టులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సీజేఐ రమణ మాట్లాడుతూ ఇన్‌స్టెంట్‌ నూడుల్స్‌ యుగంలో ప్రజలు తక్షణ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని, తక్షణ న్యాయం కోసం ప్రయత్నించే క్రమంలో నిజమైన న్యాయం ప్రమాదంలో పడుతుందని వారు గుర్తించడం లేదని అన్నారు. న్యాయాన్ని అందించడం రాజ్యాంగ బాధ్యత మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా అని అన్నారు. న్యాయమూర్తులు సామాజిక వాస్తవాలపై అవగాహన కలిగి ఉండాలని, మారుతున్న సామాజిక అవసరాలు, అంచనాలను జాగ్రత్తగా గమనించాలని సీజేఐ అన్నారు. ప్రపంచం చాలా వేగంగా కదులుతోందని, జీవితంలోని ప్రతి రంగంలో ఈ మార్పును చూస్తున్నామన్నారు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ నుండి, మేము మారాము. టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి 20-20 ఫార్మాట్‌కు మారామన్నారు. 3గంటల నిడివి ఉన్న సినిమా కంటే తక్కువ వ్యవధి వినోదాన్ని ఇష్టపడుతున్నామన్నారు. ఫిల్టర్‌ కాఫీ నుంచి ఇన్‌స్టెంట్‌ కాఫీకి మారామని తెలిపారు. ఆపద సమయంలో ప్రజలు న్యాయవ్యవస్థ వైపు చూస్తారని, న్యాయస్థానాల ద్వారా తమ హక్కులకు పరిరక్షణ లభిస్తుందని వారు బలంగా విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే న్యాయవ్యవస్థ పనితీరును మెరుగుదలపై, ప్రజలకు చేరువవుతూ, వారి న్యాయ అవసరాలను ఎలా తీర్చాలనే విషయాలను ఆలోచించడం అవసరమన్నారు. న్యాయం అందించడం రాజ్యాంగ విధి మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఏ సమాజానికైనా సంఘర్షణలు అనివార్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమినాడు సిఎం స్టాలిన్‌ మాట్లాడుతూ మద్రాసు హైకోర్టు వెలువరించే తీర్పులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ న్యాయస్థానాలపై ప్రభావం చూపుతుంటాయన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో జరిగే విచారణల్లో స్థానిక భాషను అనుమతించాలని స్టాలిన్‌ కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)