బెంగళూరు లో ఆదివారం మాంసం దుకాణాలు బంద్

Telugu Lo Computer
0


ఈ నెల 10వతేదీన బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలను నిషేధించారు. రామ నవమి సందర్భంగా ఏప్రిల్ 10న బెంగళూరు నగరం అంతటా మాంసం విక్రయాలను నిషేధిస్తూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఉత్తర్వులు జారీ చేసింది. మాంసం దుకాణాలతో పాటు కబేళాలను కూడా మూసివేయనున్నారు. బీబీఎంపీ పరిధిలోని మాంసం దుకాణాలు, కబేళాలు ఆదివారం మూసి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మహా శివరాత్రి, గణేష్ చతుర్థి నాడు కూడా మాంసం విక్రయాలను నిషేధించారు. నవరాత్రి పండుగ సందర్భంగా ఏప్రిల్ 4 నుంచి 11వ తేదీ వరకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాంసం దుకాణాలను మూసివేస్తూ అక్కడి నగర మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశాలు జారీ చేశారు. నవరాత్రుల సందర్భంగా ఢిల్లీలో ప్రజలు వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినరని మేయర్ చెప్పారు. నవరాత్రి పండుగ సందర్భంగా నగరంలో మాంసం దుకాణాలను మూసివేయడం సామరస్యాన్ని పెంపొందిస్తుందని తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)