భార్య వినతిపై జీవిత ఖైదీకి 15 రోజులపాటు పెరోల్

Telugu Lo Computer
0


రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జీవిత ఖైదు పడిన ఖైదీ లాల్ ఓ కేసులో అజ్మీరులోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఖైదీ తనకు 15రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాల్ అజ్మీరు జిల్లా కమిటీకి పిటిషన్ సమర్పించారు. జిల్లా కమిటీ జీవిత ఖైదు పడిన లాల్ కు పెరోల్ ఇవ్వలేదు. దీంతో లాల్ భార్య తన భర్తకు 15రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తన వైవాహిక జీవితంలో లైంగిక, భావోద్వేగ అవసరాలు తీరడంతోపాటు, తనకు బిడ్డ పుట్టడం కోసం భర్తకు 15రోజుల పెరోల్ ఇవ్వాలని భార్య హైకోర్టును అభ్యర్థించింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తులు ఫర్జాంద్ అలీ, సందీప్ మెహతాతో కూడిన డివిజన్ బెంచ్ నంద్ లాల్‌కు పెరోల్ ను మంజూరు చేసింది. జడ్జీలు వివిధ మతగ్రంథాలు పరిశీలించి సామాజిక, మానవతా అంశాలతోపాటు సంతానం దంపతుల ప్రాథమిక హక్కు అంటూ జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చారు.''నాకు వివాహం అయినా పిల్లలు లేరు, సంతానం కోసం నా భర్తకు 15రోజుల ఎమర్జెన్సీ పెరోల్ ఇవ్వండి'' అంటూ భార్య పెరోల్ దరఖాస్తులో కోరింది. 25వేల చొప్పున రెండు పూచీకత్తులతోపాటు రూ.50వేల వ్యక్తిగత బాండ్ ను అందించి లాల్ ను 15రోజుల పెరోల్ పై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)