ఎంపీ ను అవమానించిన ఎమ్మెల్యే !

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మహబూబాబాద్ టీఆర్ఎస్‌లో విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. యాసంగిలో రైతులు పండించిన వరిని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ గత కొద్దీ రోజులుగా తెరాస సర్కార్ ..కేంద్రం ఫై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 04 న మండలస్థాయి దీక్షలు, నిన్న రహదారుల రాస్తారోకో చేసిన తెరాస నేతలు ఈరోజు జిల్లా స్థాయి దీక్షలు చేసారు.ఈ క్రమంలో మహబూబాబాద్‌లో చేపట్టిన రైతు దీక్షలో పార్టీలోని విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాగేసుకున్నారు. తాను మాట్లాడుతున్నానని కవిత చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. తను ముందు మాట్లాడాలని మంత్రి నుంచి మైక్‌ బలవంతంగా లాక్కున్నారు. దీంతో కవిత తో పాటు అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. తాను జిల్లా అధ్యక్షురాలినని కవిత చెబుతున్నా తాను లోకల్ ఎమ్మెల్యే అంటూ శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన అనగానే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్'అలా కాదు.. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అధ్యక్షతన అనాలి' అని మంత్రికి సూచించారు. ప్రస్తుతం ఈ వీడియోస్ మీడియా లో వైరల్ గా మారాయి. గతంలో మహిళా కలెక్టర్‌తోనూ అనుచితంగా ప్రవర్తించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అధిష్టానం వార్నింగ్‌తో కలెక్టర్‌కి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇటీవల హోలీ వేడుకల్లో కార్యకర్తలకు స్వయంగా నోట్లో మద్యం పోస్తూ విమర్శలెదుర్కొన్నారు. విలేకరులను బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఈ ఘటన తో శంకర్ ఫై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)