ఆలయానికి రైల్వే నోటీసులు

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో  రైల్వే ఆస్తుల వద్ద ఉన్న చాముండా దేవి ఆలయానికి సంబంధించిన భూమి ఆక్రమణపై రైల్వే శాఖ నోటీసు జారీ చేసింది. దీనిపై స్థానిక హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఆగ్రాలోని డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) కార్యాలయానికి హిందూ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. డీఆర్‌ఎం గది బయట బైఠాయించి నిరసన తెలిపారు. ఆలయానికి నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ ఆలయంలోని కొంత భాగం రైల్వే ప్రయాణికులకు ముప్పుగా మారిందని ఆగ్రా రైల్వే డివిజన్‌ డీఆర్‌ఎం ఆనంద్‌ స్వరూప్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రత విషయంలో తాము రాజీ పడలేమని చెప్పారు. ప్రయాణికుల భద్రత, మతపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని గౌరవప్రదమైన పరిష్కారాన్ని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అన్ని వర్గాల వారితో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)