నా జీవిత చరమాంకం అసోంకు అంకితం

Telugu Lo Computer
0


అసోంను విశేషమైన, అందరూ గుర్తించగలిగే రాష్ట్రంగా తీర్చదిద్దడంలో తనవంతు సహకారం అందిస్తానని రతన్ టాటా చెప్పారు. గురువారం అసోంలో ఏడు అధునాతన కాన్సర్ ఆసుపత్రులను ను ప్రారంభించిన కార్యక్రమంలో మోడీతో పాటు రతన్ టాటా కూడా పాల్గొన్నారు. వీరివురూ మరో ఏడు క్యాన్సర్ హాస్పిటల్స్‌కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ తన జీవిత చరమాంకాన్ని అసోంకు అంకితం చేస్తానని అన్నారు. అసోం చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజు. క్యాన్సర్ రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సదుపాయం ఇకపై అందుబాటులో ఉంటుంది. క్యాన్సర్ అనేది కేవలం సంపన్నులకే వచ్చే వ్యాధి కాదు. ఇదివరకు అందుబాటులో లేని ఈ హాస్పిటల్స్‌లో ఇకపై చికిత్స తీసుకోవచ్చు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసోం అనేది భారత్‌లో చిన్న రాష్ట్రమే అయినా ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స సౌలభ్యాలు కలిగివున్న రాష్ట్రమని రతన్ టాటా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ  అసోంలో ఏడు క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు ఏడేళ్లలో ఒక హాస్పిటల్ ప్రారంభమైనా వేడుక చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒకే రోజు ఏడు క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రారంభించాం. మరికొన్ని నెలల వ్యవధిలోనే అసోంలో మరిన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. నెలల వ్యవధిలోనే ఈ హాస్పిటల్స్ అసోం ప్రజల సేవలో తరిస్తాయని దీమా వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)