కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విడుదలను ఆపాలని కేంద్రం సూచన !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే కంపెనీలకు కీలక ఆదేశం జారీ చేసింది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విడుదలను ఆపేయాలని కేంద్రం సూచించింది. రోజు రోజుకీ ఎలక్ట్రిక్ టూ వీలర్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ ఢిల్లీ వేదికగా ఓ సమావేశం నిర్వహించింది. ఇందులోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలు జరగని కంపెనీలు కూడా ఈ సారి ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయడానికి వీలులేదని కేంద్రం తెగేసి చెప్పింది. "కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు లాంచ్ చేయవద్దని మౌఖిక ఆదేశాలిచ్చాం. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎందుకు దగ్ధమవుతున్నాయి? వాటికి గల కారణాలను పరిశోధించాలి. అధ్యయనం చేయాలి. అలాగే వాటిని ఆపడానికి ఏం చేయాలి? అన్న అంశాలపై స్పష్టత వచ్చేంత వరకూ ఎలక్ట్రిక్ వాహనాల లాంచింగ్ వద్దని సూచించాం” అని ఓ అధికారి పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)