మన ప్రాజెక్టులు గుజరాత్ కు తరలింపు !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో కేంద్రాన్ని నిలదీయటంతో ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష గట్టారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకపోగా.మనకు దక్కాల్సిన ప్రాజెక్ట్ లను కూడా అక్రమంగా తన సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలిస్తున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలోని కేంద్రం.తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందని ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సంప్రదాయ వైద్య కేంద్రాన్ని గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రారంభిచడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ట్విట్టర్ వేదికగా కేంద్రం వివక్షపై మండిపడ్డారు. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిష్టాత్మక జాతీయ కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో కిషన్ రెడ్డి విఫలమైనట్లు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణపై ప్రధాని మోడీ వివక్ష ఓ ధారావాహికంలా సాగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు నిరాటంకంగా అన్యాయం చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మంజూరు చేసిన జాతీయ ఇన్స్‌టిట్యూట్ల వివరాలను కూడా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్‌, ఐఐఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లను ఇతర రాష్ట్రాలకు మంజూరు చేశారని. కానీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)