బుల్డోజర్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే !

Telugu Lo Computer
0



ఈ నెల 16న శోభాయాత్ర నిర్వహిస్తుండగా ఆ ప్రాంతలో హింస చెలరేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇక, ఈ పరిస్థితుల్లో ఈ ఉదయం నార్త్​ దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్ (ఎన్​ఎండీసీ) అధికారులు ఆ ప్రాంతానికి బుల్డోజర్లతో వెళ్లారు. అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. కూల్చివేతల పైన స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావటంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. గతంలోనే అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు ఇచ్చామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​లో భాజపా అధికారంలో ఉంది. దీంతో దిల్లీలో ప్రస్తుతమున్న శాంతియుత వాతావరణానికి విఘాతం కల్గించేందుకు భాజపా, హోంమంత్రి అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే, దిల్లీ వక్ఫ్​ బోర్డు ఛైర్మన్​ అమానాతుల్లా ఖాన్ ఆరోపించారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించేందుకు రంజాన్​ లాంటి పవిత్ర మాసంలో ఇలా చేయడం దారుణమన్నారు. అయితే, బీజేపీ నేతలు ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల పైన చర్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. గతంలో ఈ డ్రైవ్ నిర్వహించేందకు భద్రత కావాలని అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారని ఎన్​ఎండీసీ మేయర్ రాజా ఇక్బాల్​ సింగ్ వెల్లడించారు. ఈసారి పటిష్ఠ భద్రత కల్పిస్తున్నందు వల్ల ఆపరేషన్​ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చేస్తున్నట్లు స్పష్టం చేసారు. ఈ సమయంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జహంగీర్​పురిలో బుల్​డోజర్లతో జరుగుతున్న కూల్చివేతపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. దీంతో..కూల్చివేతల ప్రక్రియకు విరామం ఇచ్చారు. కోర్టు ఆదేశాలను పాటిస్తామని అధికారులు స్పష్టం చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)