జీరో మైల్ రాయి చరిత్ర !

Telugu Lo Computer
0


దారి వెంట వెళ్లే సమయంలో దూరాన్ని తెలుసుకోవడానికి రోడ్డుపై కనిపించే మైలు రాల్లే ఆధారం. వీటి ద్వారానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎంత దూరం ఉందో తెలుసుకుంటాం. అయితే భారత దేశానికి ఒక చోట జీరో మైల్‌ స్టోన్‌ ఉంది. అక్కడి నుంచే దేశంలోని పలు నగరాలకు దూరాన్ని లెక్క కడతారు. బ్రిటీష్ వారు  భారత్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తమ పరిపాలన, భద్రతా అవసరాల దృష్ట్యా దేశం మొత్తాన్ని శాస్త్రీయంగా సర్వే చేయించారు. ఇందులో భాగంగానే త్రికోణమితి (ది గ్రేట్ ట్రిగనామెట్రికల్‌ సర్వే) పేరుతో సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగానే నాగ్‌పూర్‌లో జీరో మైల్‌ స్టోన్‌ స్థూపాన్ని నిర్మించారు. 6.5 మీటర్ల ఎత్తైన ఈ స్థూపం పక్కనే రాయిపై 1907 అని ఉంటుంది. దీని ఆధారంగా ఆ సమయంలో ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్థూపం నుంచి దక్షిణ దిక్కులో 62 మైళ్ల దూరంలో కవాథ, ఆగ్నేయంగా 318 మైళ్ల దూరంలో హైదరాబాద్, తూర్పున 125 మైళ్ల దూరంలో చందా, 174 మైళ్ల దూరంలో రాయ్‌పూర్, ఈశాన్యంగా 170 మైళ్ల దూరంలో జబల్‌పూర్, వాయువ్య దిక్కులో 79 మైళ్ల దూరంలో సియోని, 83 మైళ్ల దూరంలో చింద్వార, పశ్చిమాన 101 మైళ్ల దూరంలో బైటుల్ నగరాలు ఉన్నాయి. నాగ్‌పూర్ దేశంలోని చెన్నై, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీలకు మధ్యలో ఉండడంతో అక్కడి నుంచే దేశంలోని అన్ని నగరాలకూ దూరాన్ని లెక్కిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)