శివసేన ఎంపీ భావనా గవానీకి ఈడీ నోటీసులు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. శివసేన సీనియర్‌ నాయకురాలు, యావత్మాల్‌ ఎంపీ భావనా గవాలీకి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ వ్యవహారానికి సంబంధించిన వచ్చే నెల 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో ఇప్పటికే ఈడీ మూడుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే భావనా ఒక్కసారికూడా విచారణకు హాజవ్వలేదు. దీంతో తాజాగా మరోసారి తాఖీదులు ఇచ్చింది.  ఎంపీ భావనా గవాలీ సహాయకుడైన సయీద్‌ ఖాన్‌ మహిళా ఉత్కర్ష ప్రతిష్ఠాన్‌కు చెందిన నిధులను కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనకు చెందిన రూ.3.75 కోట్ల విలువైన స్థిరాస్తును ఈడీ అటాచ్‌ చేసింది. అయితే ఈ వ్యవహారంలో భావనా గవాలీకి భాగస్వామ్యం ఉన్నదని, ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోలీసులు ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)