20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 April 2022

20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధం


మహారాష్ట్రలోని నాసిక్  నుంచి బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను జితేంద్ర ఈవి  ట్రాన్స్‌పోర్ట్ చేస్తుండగా ఈ దుర్ఘటన నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై ఆరా తీసేందుకు కంపెనీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కంటైనర్ లో మొత్తం 40 స్కూటర్లు ఉన్నట్లుగా చెబుతుండగా మొత్తం అన్నింటికీ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీలు, సంబంధిత అంశాల్లో నాణ్యతే ఈ ఘటనలకు కారణమై ఉండొచ్చని పలువురు నిపుణులు అంటున్నారు. “స్కూటర్ ట్రాన్స్‌పోర్ట్ కంటైనర్‌లో తరలిస్తుండగా దురదృష్టవశాత్తు ఏప్రిల్ 9న ఈ ఘటన జరిగింది. సమయానికి స్పందించడంతో పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది. సేఫ్టీని ప్రాథమికంగా తీసుకుంటాం. దీనికి కారణాల్ని పర్యవేక్షిస్తున్నాం. ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘటనలపై ఆరా తీస్తున్నాం” అని జితేంద్ర ఈవి అధికారి ప్రతినిధి వెల్లడించారు.

No comments:

Post a Comment