200 ఎకరాల గోధుమ పంట అగ్నికి ఆహుతి

Telugu Lo Computer
0


హర్యానా, కర్నాల్ లోని కచ్వా గ్రామంలోని పంట పొలాల్లో మంటలు చెలరేగి, గాలి తీవ్రతకు  5 కిలో మీటర్ల మేర మంటలు వ్యాపించి సుమారు 200 ఎకరాల్లో గోధుమ పంటను బూడిద  చేశాయని  స్థానికులు తెలిపారు. పంట పొలాల్లో మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టినా గోధుమ పంట ధ్వంసమైందన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా వచ్చారని రైతులు ఆరోపించారు. తమ కళ్లముందే గోధుమ పంట అగ్నికి ఆహుతవ్వడంతో అన్నదాతులు తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)