దేశంలో 861 కొత్త కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో కరోనా వైరస్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెయ్యికి సమీపంలోనే నమోదవుతున్నాయి. తాజాగా 2.7 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 861 మందికి వైరస్ సోకినట్లు వెల్లడైంది. నిన్న మరణాలు భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో ఆరుగురు మరణించారు. ముందురోజు ఆ సంఖ్య 29గా ఉంది. నిన్న 929 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 11,058కి తగ్గిపోయాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతుండగా.. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. ఆదివారం కేవలం 2.4 లక్షల మంది మాత్రమే టీకా తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసు కూడా అందిస్తున్నారు. 185 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)