పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు!

Telugu Lo Computer
0


పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.1శాతంగా నిర్ణయించింది. నేటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత దశాబ్ధ కాలంలో పీఎఫ్‌పై వడ్డీ రేటు ఇంత తక్కువగా ఎప్పుడూ లేదు. గత రెండేళ్ల కాలంలో వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పు చేయలేదు. కనీసం ఈసారైనా పెంచుతారని లక్షలాది మంది పీఎఫ్ ఖతాదాారులు ఎదురు చూశారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ వడ్డీ రేటను మరింతగా తగ్గించింది. ఈ నిర్ణయంపై కోట్లాది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం, 2016-17 సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించింది. ఓ దశలో 8.8 శాతం వరకు వడ్డీ లభించింది. కానీ ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం మాత్రమే వస్తోంది. గతంలో వడ్డీ రేటు తగ్గించినందున ఈసారైనా..వడ్డీ పెరుగుతుందా.? అని ఎదరుచూసిన వారికి.. మళ్లీ నిరాశే ఎదురయింది. 2015 ఆగస్ట్ 5 నుంచి 2021 మార్చి 31 వరకు ఈపీఎఫ్ఓ ఈక్విటీ లింక్డ్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో రూ.1,37,895.95 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అందులో రూ.32,070 కోట్లు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేయడం విశేషం. ఈ పెట్టుబడుల ద్వారా 2020-21 లో ఈపీఎఫ్ఓ రూ.72,811 కోట్ల వడ్డీని పొందింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)