తమిళనాడు లో 12 నెమళ్ళు మృతి

Telugu Lo Computer
0


తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకురుంపట్టి గ్రామానికి చెందిన 75 ఏళ్ల రైతు తన వ్యవసాయ భూమిలో చనిపోయిన రెండు నెమళ్లతో సహా 12 నెమళ్లకు విషం పెట్టి చంపినందుకు అటవీ శాఖ అధికారులుఅరెస్టు చేశారు. తిరుపత్తూర్ జిల్లా  వాణియంబాడి పక్కనే ఉన్న కురుంపట్టి గ్రామానికి చెందిన షణ్ముగం అనే 75 ఏళ్ల రైతు కొన్ని నెలల క్రితం అదే ప్రాంతంలోని సావిత్రి అనే మహిళను నుంచి భూమిని కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. ఈ క్రమంలో నెమళ్లు వ్యవసాయ పంటను ధ్వసం చేస్తున్నాయని.. గుర్తించాడు. దీంతో వాటి బారినుంచి పంటను కాపాడుకోవడం కోసం విషం కలిపిన ధాన్యాన్ని పొలంలో చల్లాడు. దీంతో అవి తిని నెమళ్ళు మరణించాయి. అయితే తమ పొలాన్ని చూడడం కోసం సావిత్రి కుమారుడు సిలంబరసన్‌ వెళ్ళినప్పుడు అక్కడ 12 నెమళ్లు మరణించి ఉండడం చూశాడు. దీంతో షాక్‌కు గురైన వెంటనే అలంగాయం అటవీశాఖకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖాధికారులు నెమళ్లకు విషం తిని చనిపోయిట్లు గుర్తించారు. ఆ నెమళ్లను స్వాధీనంలోకి తీసుకున్నారు. అనంతరం రైతు షణ్ముగంను అదుపులోకి తీసుకున్నారు. అలాగే చనిపోయిన నెమళ్లను పోస్ట్ మార్టం కు పంపించారు. అనంతరం దహనం చేసారు అటవీశాఖ అధికారులు. తిరుపత్తూరు బ్లాక్‌లోని అనేక గ్రామాల్లో నెమళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అదే గ్రామంలో ఫిబ్రవరి 4 నుంచి ఐదు నెమళ్లు చనిపోయిన ఘటన ఇది రెండోది. పంటపొలాలను పాడు చేస్తున్న నెమళ్లకు విషం పెట్టి చంపడం పరిపాటిగా మారింది. జాతీయ పక్షి నెమలిని చంపడం చట్ట విరుద్ధమైన చర్య అని, ఇటువంటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు అధికారి చెప్పారు. నెమళ్లను చంపటానికి విషం పెట్టలేదని..ఎలుకను చంపటానికే విషం కలిపి పెట్టానని షణ్మగం పోలీసులకుతెలిపాడు. షణ్ముగం పంట పొలాన్ని అధికారులు పరిశీలించగా ఎలుకల కలుగుల్లో వరబియ్యంలో విషం కలిపి పెట్టినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది. కానీ జాతీయ పక్షి నెమలి కావటంతో నెమళ్లు ఇంత సంఖ్యలో చనిపోవటంతో షణ్ముగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నెమళ్ల మరణానికి కారణమైన షణ్మగానికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు అధికారి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)