ఎండాకాలం - చర్మ వ్యాధులు - నివారణోపాయాలు

Telugu Lo Computer
0


ఎండాకాలంలో  బయటకు వెళ్ళాలి అంటే బయపడుతూ ఉంటారు. అయినా కూడా పనుల కారణంగా ఎండలో తిరగాల్సిందే. అలా ఎండలో తిరిగిన వారికి ఎండ వలన చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి.  విటమిన్ ఎ ,సి,ఇ, చల్లని నీరు, సూర్యరశ్మి వలన కలిగే వ్యాధులకు తగిన మందు అవుతుంది. నిమ్మకాయ రసం, గుడ్డులోని తెల్లసొనను ఒక పాత్రలో పోసి  వేడి చేయాలి. అలా వేడి చేసిన దానిని సూర్యరశ్మి వలన కలిగే ఎలర్జీలకు రాయాలి. వెంటనే కడగకుండా కాసేపటి తర్వాత కడుక్కోవాలి. 7,8 చుక్కల పాలలో ఒక చెంచా నిమ్మరసం కలిపి మసాజ్ చేసి కొంచంసేపు ఆగిన తర్వాత సోప్ వాటర్ తో ముఖం కడుక్కోవాలి. మనం బయటకు వెళ్లవలసిన అవసరం ఏర్పడినప్పుడు తగినంత నిమ్మరసం తాగి బయటకు వెళ్లడం మంచిది. నీటిలో లీట్టస్ ఆకుల్ని వేసి ఆ నీటిని బాగా మరిగించి ఆ నీటిని శరీరానికి రాయ వచ్చును.  పుల్లటి పెరుగుపై మీగడను, తేనె ను కలిపి రాసినా ఎండ వలన వచ్చే చర్మ వ్యాధులను నివారించడానికి ఉపయోగపడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)