80,039 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం !

Telugu Lo Computer
0


అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రసంగం ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా, మిగిలిన 80,039 పోస్టులకు  నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేశారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. పోలీస్ శాఖ మినహా ఉద్యోగార్థుల వయోపరిమితిని మరో 10 పదేళ్లకు పెంచుతున్నట్లు  కేసీఆర్ వెల్లడించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చామని దీనివల్ల అందరికీ అవకాశాలు వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల వివాదం పరిష్కారమైతే అక్కడ కూడా అవకాశాలు వస్తాయని తెలిపారు. మరో 10 నుంచి 20 వేల ఉద్యోగాల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)