తల్లావఝ్జల సుందరం మాస్టారు కన్నుమూత - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 22 March 2022

తల్లావఝ్జల సుందరం మాస్టారు కన్నుమూత


ప్రముఖ రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు కన్నుమూశారు. 71 ఏళ్ల సుందరం మాస్టర్ హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. నాటక రంగానికి నవ్వులు అద్దిన రచయిత సుందరం మాస్టారు. తనదైన ఛలోక్తులులతో నవ్వులు పూయించారు. సోమవారం గుండెపోటుతో చిక్కడపల్లిలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని తన మిత్రుడు తనికెళ్ల భరణికి ఫోన్‌ చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఇద్దరు శిష్యులు ఆయనను ముషీరాబాద్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాటక రచన, ప్రదర్శనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. రెండు వందలకుపైగా నాటకాల్లో నటించారు. నాటకానికి హాస్యం వైపు మళ్లించే ప్రయత్నంలో విజయం సాధించారు. సుందరం మాస్టారు కన్నుమూయడంతో పలువురు రంగస్థల ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.


No comments:

Post a Comment