ఐదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Telugu Lo Computer
0


గడచిన ఆరు రోజుల్లో ఐదుసార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్థలు పెట్రోలుపై లీటరుకు 50 పైసలు, డీజిల్‌పై లీటరుకు 55 పైసలు చొప్పున పెంచడంతో ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వారంలోనే లీటరు పెట్రోలు ధర రూ. 3.70 చొప్పున, లీటరు డీజిల్ ధర రూ.3.75 చొప్పున పెరిగింది. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.99.11కు, లీటరు డీజిల్ రూ.90.42కు లభిస్తున్నాయని ఇంధన రిటెయిలర్లు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. స్థానిక పన్నుల విధానానికి అనుగుణంగా వీటి ధరలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయని తెలిపారు. ముంబైలో లీటరు పెట్రోలు రూ.113.88కు లభిస్తోందని, లీటరు డీజిల్ రూ.98.13కు లభిస్తోందని తెలిపారు. ఈ నగరంలో అంతకుముందు కన్నా లీటరు పెట్రోలుకు 53 పైసలు, లీటరు డీజిల్‌కు 58 పైసలు పెరిగాయని తెలిపారు. చెన్నైలో లీటరు పెట్రోలు రూ.104.90కి లభిస్తుండగా, లీటరు డీజిల్ రూ.95.00కు లభిస్తోంది. కోల్‌కతాలో ఈ ధరలు వరుసగా రూ.108.53, రూ.93.57.

Post a Comment

0Comments

Post a Comment (0)