బెంగాల్‌లో ఆగని హింస

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లో బీర్భూమ్ ఘటన జరిగి రెండు రోజులైనా గడవక ముందే మరో రెండు హింసాత్మక ఘటనలు జరిగాయి. అధికార తృణమూల్ పార్టీకి చెందిన నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలు రెండూ వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. నాదియా అనే గ్రామంలో తృణమూల్ నేత సహదేవ్ మండల్‌పై కాల్పులు జరిపారు. దీంతో ఆ నేత అక్కడికక్కడే మృతి చెందారు. హుగ్లీలోని తారకేశ్వర్ గ్రామంలో తృణమూల్ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ రూపా సర్కార్‌ను కారుతో తొక్కి చంపే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. రూపా సర్కార్ పనుల నిమిత్తం బయటికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఓ మారుతి కారులో గుర్తు తెలియని వ్యక్తులు తనను వెంబడించారని, వెనక నుంచి వచ్చి గుద్దినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)