కశ్మీర్ వ్యక్తికి వసతి నిరాకరించిన హోటల్‌

Telugu Lo Computer
0

 



జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తి కావడంతో ఢిల్లీలోని ఓ హోటల్ వసతికి నిరాకరించింది. ఈ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు చూపించినా ఆ హోటల్ యాజమాన్యం వసతికి నిరాకరించింది. ఆయన కశ్మీర్‌కు చెందిన వ్యక్తి కావడంతోనే ఆయన వసతికి ఓయో యాజమాన్యం నిరాకరించింది. ఆ వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా ఓయో హోటల్‌లో ఓ రూమ్‌ను బుక్ చేసుకున్నారు. ఆయన అక్కడికి వచ్చి, వసతి నిమిత్తం యాజమాన్యాన్ని సంప్రదించాడు. ఆయన జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తి కావడంతో వసతికి యాజమాన్యం నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన వ్యక్తులకు హోటల్‌లో వసతి ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, అందుకే తాము ఆ వ్యక్తికి వసతి నిరాకరించామని ఓయో యాజమాన్యం పేర్కొంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. హోటల్ యాజమాన్యాలకు తాము ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఐడీ ఉన్న కారణంగా ఓ వ్యక్తికి హోటల్ యాజమాన్యం వసతి నిరాకరించిందన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ పోలీసుల మార్గదర్శకాల వల్లే తాము వసతి నిరాకరించామని హోటల్ యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి మార్గదర్శకాలను మేము జారీ చేయలేదని స్పష్టం చేస్తున్నాము అంటూ ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)