దేశంలో 1,,225 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత కొద్దిరోజులుగా 2 వేల దిగువన నమోదవుతోన్న కొత్త కేసులు 1,200కు తగ్గాయి. తాజాగా మృతుల సంఖ్య 30 లోపునకు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం బుధవారం 6 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,225 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.20 శాతానికి క్షీణించింది. నిన్న 1,594 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో అత్యధికంగా 21 కేరళ నుంచే వచ్చాయి. ఇక క్రియాశీల కేసులు 14,307కి చేరాయి. కరోనా దేశంలోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి 4.30 కోట్లకుపైగా కేసులొచ్చాయి. అందులో రికవరీల వాటా 98.76 శాతానికి పెరగ్గా.. కొవిడ్ బాధితులు 0.03 శాతానికి తగ్గిపోయారు. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. గత ఏడాది మొదట్లో కేంద్రం ప్రారంభించిన టీకా కార్యక్రమంలో భాగంగా 184 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 22.27 లక్షల మంది టీకా తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)