జమ్మూ కశ్మీర్‌లో విరిగిపడిన కొండచరియలు.

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు జమ్మూ -శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఉధంపూర్‌లోని సమ్రోలి సెక్షన్‌లోని దేవల్ బ్రిడ్జ్ సమీపంలో జాతీయ రహదారిపై పెద్ద కొండచరియ విరిగిపడింది. దీంతో హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కొండచరియలను తొలగిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత తొందరగా ట్రాఫిక్ ను పునరుద్ధరిస్తామన్నారు. 270 కిలోమీటర్ల పొడవును ఈ హైవేపై జమ్ము నుంచి చెనాని, పట్నిటాప్, దోడా, రాంబన్, గూల్, బనిహల్, శ్రీనగర్ వైస్-వెర్సా వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశామన్నారు. దీంతో జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)