కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 30 March 2022

కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి


ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కశ్మీరీ పండిట్లు, కశ్మీర్ ఫైల్స్ పై ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో ఐపీ కాలేజీ నుంచి సీఎం నివాసం వరకు ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో కశ్మీరి పండిట్లపై సీఎం కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన బీజేపీ కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించారు. దాడికి పాల్పడ్డారు. దీంట్లో భాగంగా కేజ్రీవాల్ ఇంటిముందు ఉన్న మెయిన్‌గేట్‌, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లను ధ్వంసం చేశారు. ఇంటి గోడలపై పెయింటింగ్‌ పూశారు. ఈ దాడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వానానికి దిగి నానా రభస చేశారు. కేజ్రీవాల్ ఇంటిపై చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. 'దేశంలోని హిందువులను అవమానించినందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి అంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పేవరకు బిజెపి యువమోర్చా వదిలేది లేదు అంటూ సూర్య ట్వీట్ చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేజ్రీవాల్‌ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. సినిమాలో పండిట్లను తరిమేసినట్లు, ఊచకోత కోసినట్లు చూపించడం అవాస్తవం అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాపై బీజేపీ చేస్తున్న ప్రచారంపై కూడా కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.దీంతో సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో ఆ పార్టీ మోర్చా కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఐపీ కాలేజ్‌ నుంచి సీఎం ఇంటి వద్దకు చేరుకొని దాడికి ప్రయత్నించారు. హిందువులను కించపరిచేలా మాట్లాడిన కేజ్రీవాల్‌ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ సూర్య డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పే వరకు బీజేపీ యువ మోర్చా విడిచిపెట్టదని హెచ్చరించారు. ఎంపీ సూర్య ట్వీట్‌ చేశారు. కేజ్రీవాల్ నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 'సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ దాడి చేశారు. సెక్యూరిటీ బారికేడ్లను పగలగొట్టారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గేటును పడగొట్టారు. ఇదంతా ఢిల్లీ పోలీసుల పూర్తి మద్దతుతోనే జరిగింది. ఇంతకీ ఈ డిమాండ్లన్నీ కశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించాలనే చేస్తున్నారా?' అంటూ ట్వీట్‌ చేసింది.

No comments:

Post a Comment