రేపటి నుంచి 12-14 ఏళ్ల వారికి కరోనా టీకా!

Telugu Lo Computer
0


రేపటి నుంచి టీకా ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారికి రేపటి నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు వైద్య సిబ్బంది. ప్రస్తుతం 12-14 ఏళ్ల వారికి హైదరాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న బయోలాజికల్​ ఈ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్​. ప్రస్తుతానికి దీనిని మాత్రమే చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతి ఉంది. సాధారణంగా అందరికీ రిజిస్ట్రేషన్ చేసినట్లుగానే పిల్లకు కూడా కొవిన్​ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి. ముందుగా కొవిడ్ యాప్​ లేదా పోర్టల్​లోకి వెళ్లి ఫోన్ నంబర్ ఎంటర్​ చేయాలి. పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి నంబర్​ను వినియోగించుకోవచ్చు. ఒకే నంబర్​పై నలుగురికి రిజిస్ట్రేషన్​ చేసే వీలుంది. కాబట్టి ఇప్పటికే ఒకే నంబర్​పై భార్యా, భర్తలు టీకా రిజిస్ట్రేషన్​ చేసుకున్నా అదే నంబర్​ను మరో ఇద్దరికి వినియోగించే వీలుంది. ముందుగా మొబైల్ నంబర్ ఇవ్వడం ద్వారా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ధృవీకరిస్తే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఆధార్​ నంబర్​ వంటి వివరాలను ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్​ పూర్తి చేయొచ్చు. ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియని వారు నేరుగా.. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కూడా రిజిస్ట్రేషన్​ చేసుకునే వీలుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అనుకూలమైన సమయంలో స్లాట్​ బుక్ చేసుకుని టీకా తీసుకోవచ్చు. 


Post a Comment

0Comments

Post a Comment (0)