డోర్‌ టు డోర్‌ కార్యక్రమం చేయాలి : జగన్మోహన రెడ్డి

Telugu Lo Computer
0


మూడేళ్ల తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి అధ్యక్షతన వైసీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి పిలవడానికి ప్రధాన కారణాలు, ఉద్దేశాలు ఉన్నాయన్న ఆయన ప్రభుత్వం ఏర్పాటై 34 నెలలు కావొస్తోంది మరో 2 నెలల్లో మూడు సంవత్సరాలు కూడా పూర్తి కావొస్తోంది. ఇక పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.. నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లడం కన్నామరే ప్రభావవంతమైన కార్యక్రమం లేదన్న ఆయన కనీసం మూడు సార్లు డోర్‌-డోర్‌టు కార్యక్రమం చేయాలి.. కనీసం 2 సార్లు ప్రతి గడపకూ వెళ్లాల్సిన అవసరం ఉందని లేకపోతే ఎంతమంచి ఎమ్మెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు సీఎం వైఎస్‌ జగన్.. అందుకే ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామన్న ఆయన.. మన ఇళ్ల దగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్‌ పెట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.. ఉగాది నుంచి వాలంటీర్లకు సన్మానం చేస్తున్నాం.. వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామని.. వారు బాగా చేసిన మంచి పనులకు చాలామంది వాలంటీర్లకు మనం పారితోషికం, మెడల్‌ ఇవ్వడం చేస్తున్నట్టు వెల్లడించారు.. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తున్నామని.. ఏప్రిల్‌ 2 నుంచి ఉగాది రోజున జరిగే ఈ కార్యక్రమం నెలరోజులు కొనసాగుతుందన్న ఆయన.. ప్రతి ఊరికీ వెళ్లి.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని.. గత ఏడాది కూడా వాలంటీర్లను సన్మానించాం.. ఈసారి ప్రతి రోజూ 3-4 గ్రామాలు వెళ్లి వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలు ఎమ్మెల్యే తిరగాలని స్పష్టం చేశారు. ఒక్కో గ్రామ సచివాలయానికి 2 రోజులు వెళ్లాలి. ఆ సచివాలయంలో ప్రతి ఇంటికీ తిరగాలి.. ఆ ఇంట్లో జరిగిన మేలేంటి? ప్రతి కుటుంబానికి జరిగిన మేలుపై ముఖ్యమంత్రిగారి రాసిన లేఖను అందించాలని.. వారి ఆశీస్సులను పొందాలని తెలిపారు.. ఈ గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలి.. క్యాడర్‌తో మీరు మమేకం కావాలి.. మళ్లీ బేసిక్స్‌లోకి వెళ్లి బూత్‌ కమిటీల ఏర్పాటు కూడా జరగాలని.. బూత్‌ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలని.. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగానలి స్పష్టం చేశారు.. వేరే సచివాలయానికి వెళ్లేముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని తెలిపిన ఆయన.. నియోజకవర్గంలో డోర్‌-టు డోర్‌ పూర్తికావడానికి కనీసం 8 నెలలు పడుతుందని 8 నెలలు అయ్యేసరికి ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే వెళ్తారని.. ఆ కుటుంబాల ఆశీర్వాదాలు తీసుకుంటారని వెల్లడించారు. మేలో సచివాలయాల సందర్శన ప్రారంభమయ్యే సరికి, జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు కావాలని స్పష్టం చేసిన ఏపీ సీఎం.. ఏప్రిల్‌ నాటికి కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలి.. ఈ కమిటీల ఏర్పాటులో రీజినల్‌ కో-ఆర్డినేటర్లు చురుగ్గా వ్యవహరిస్తారని, 3-4 జిల్లాలకు రీజినల్‌ కో-ఆర్డినేటర్లు ఉంటారని, కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని రీజినల్‌ కో-ఆర్డినేటర్లను నియమిస్తామన్నారు. ఇక, జులై 8న ప్లీనరీ నిర్వహిస్తాం. ఇలా ఒకవైపున పార్టీ నిర్మాణం సాగుతుందని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)