వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్షేత్రస్థాయికి అవగాహన? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 20 February 2022

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్షేత్రస్థాయికి అవగాహన?


గ్రామకంఠంలో అంటే గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న స్థలాలు, అదేవిధంగా పాత లే అవుట్లలో గతంలోనే రిజిస్ర్టేషన్‌ అయిన స్థలాల రీసేల్‌ రిజిస్ర్టేషన్లకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా రిజిస్ర్టేషన్ల శాఖ చర్యలు తీసుకోనుంది. డీటీసీపీ లే అవుట్లలోని స్థలాలను మాత్రమే రిజిస్ర్టేషన్‌ చేయాలంటూ రిజిస్ర్టేషన్ల శాఖ ఇచ్చిన ఉత్తర్వులతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. అనధికార లే అవుట్లలోని స్థలాలను రిజిస్ర్టేషన్‌ చేస్తే సబ్‌ రిజిస్ర్టార్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో ఎక్కడికక్కడ రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి. ఇటీవల వేసిన అనధికార లే అవుట్లలోని స్థలాలతోపాటు, గతంలో ఎప్పుడో వేసిన లే అవుట్‌లలో ఇప్పటికే ఒకటి, రెండుసార్లు రిజిస్ర్టేషన్లు అయిపోయిన స్థలాలకు కూడా రిజిస్ర్టేషన్లు ఆపేశారు. గ్రామాల్లో అనాదిగా ఉన్న స్థలాలు, ఇళ్ల మధ్య స్థలాల రిజిస్ర్టేషన్లను కూడా ఆపేశారు. దీనిపై ఆశాఖ ఉన్నతాధికారు లు చర్చించినట్టు తెలిసింది. తామిచ్చిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని భావించినట్టు సమాచారం. ఈ నెల 18న ఆ శాఖ ఐజీ రామకృష్ణ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే.. మరో రెండు ఉత్తర్వులను రిఫరెన్సులుగా ఇచ్చారు. అందులో ఒకటి 7-4-2020న ఇచ్చిన ఒక మెమో కూడా ఉంది. ఆ మెమోకు అనుగుణంగానే కొత్త ఆదేశాలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఆ మెమోలో అనధికారిక లే అవుట్ల రిజిస్ర్టేషన్లను నిషేధించారు. నగరపాలక సంస్థలు, డీటీసీపీ, ఇతర చట్టబద్ధ సంస్థల అనుమతి తీసుకుని వేసిన లే అవుట్లలో స్థలాలను మాత్రమే రిజిస్ర్టేషన్‌ చేయాలని పేర్కొన్నారు. అయితే ఈ తేదీకి ముందే అనధికారికంగా లే అవుట్లు వేసి.. ఒకసారి అమ్మేసి రిజిస్ర్టేషన్లు చేసి ఉంటే.. అలాంటి క్రయవిక్రయాలపై రిజిస్ర్టేషన్లు చేయాలని పేర్కొన్నారు. కొత్తగా అనధికార లే అవుట్లు రాకుండా ఉండేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఆ తేదీ తర్వాత కేవలం డీటీసీపీ, లేకుంటే ఇతర చట్టబద్ధ సంస్థలు అనుమతించిన లే అవుట్లలోని స్థలాలనే రిజిస్ర్టేషన్లు చేస్తారు. అదే విధంగా గ్రామకంఠం పరిధిలోని స్థలాల రిజిస్ర్టేషన్లు కూడా చేయడానికి అనుమతించారు. ఇక్కడ గ్రామకంఠం అంటే గ్రామంలో ఉన్న ప్రైవేటు స్థలాలు అని అర్థం. అంటే ఒక గ్రామంలో ఇళ్లున్నంత మేర, ఇళ్లకు మధ్యలో ఉండే ఖాళీస్థలాలకు రిజిస్ర్టేషన్‌ చేయాలి. అదేవిధంగా అనుమతి పొందిన ఇంటి ప్లాన్‌ ఉన్న స్థలాలు, బీపీఎస్‌ పొందిన ఇళ్లకు సంబంధించిన స్థలాలు, ఎల్‌ఆర్‌ఎస్‌ కింద అనుమతి పొందిన స్థలాలు, ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసిన స్థలాలు...ఇలాంటి వాటన్నింటికీ రిజిస్ర్టేషన్లు యథావిధిగా ఉంటాయని పేర్కొన్నారు. తాజాగా ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వుల్లో 7-4-2020 నాటి మెమోను రిఫరెన్స్‌గా చూపించారు. ఆ మెమో ప్రకారం వెళ్తూ.. కొత్తగా వేసిన అనధికార లే అవుట్లలోని స్థలాలను మాత్రం రిజిస్ర్టేషన్‌ చేయొద్దని ఆదేశించారు. 

No comments:

Post a Comment