గుండె జబ్బులు - ఆహార నియమాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 23 February 2022

గుండె జబ్బులు - ఆహార నియమాలు


ప్రస్తుత తరుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి కామన్ అయిపోయాయి. చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సైలెంట్ కిల్లర్ లా వస్తోంది. ముందస్తుగా కొందరిలో ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. దీంతో హఠాత్తుగా గుండె పోటు వచ్చి ప్రాణాలు పోతున్నారు. ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారికి సైతం హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఒత్తిడి, నిత్యం అధికంగా పనిచేయడం, గంటల తరబడి కూర్చోవడం, శారీరక శ్రమ అసలు చేయకపోవడం, అధిక బరువు, డయాబెటిస్, నిద్ర తక్కువగా పోవడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. హైబీపీ కూడా వస్తోంది. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తున్నాయి. అయితే ప్రస్తుతం చాలా మందికి శరీరంలో పలు చోట్ల రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడడం వల్ల కూడా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వారి సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. 

ఆహార నియమాలు  : గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను అలాగే నమిలి తినాలి. నేరుగా తినలేమని అనుకుంటే తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇలా రోజూ పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. క్లాట్స్ కరిగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూడడంలో ద్రాక్ష రసం కూడా బాగానే పనిచేస్తుంది. రోజూ ఒక కప్పు ద్రాక్షలను తినడం లేదా ఒక గ్లాస్ ద్రాక్ష రసం తాగితే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్లో ఉండే క్లాట్స్ ను కరిగిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. శరీరంలోని క్లాట్స్ ను కరిగించడంలో రెడ్ వైన్ కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని రోజూ 60 ఎంఎల్ మోతాదులో తాగాలి. రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను సంరక్షిస్తాయి. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగినా రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. ఇది రక్తనాళాల వాపులను తగ్గిస్తుంది. దీంతోపాటు రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. వారానికి రెండు సార్లు 60 ఎంఎల్ చొప్పున మద్యం సేవించాలి. మద్యాన్ని పరిమిత మోతాదులో సేవించడం వల్ల కూడా రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతోనూ క్లాట్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. తరచూ తీసుకునే ఆహారాల్లో కివీ పండ్లు, పైనాపిల్‌, పాలకూర వంటి ఆహారాలను భాగం చేసుకోవాలి. ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. క్లాట్స్‌ను కరిగించడంలో సహాయ పడతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

No comments:

Post a Comment