9 లక్షల షేర్లను ఫ్రీగా ఇచ్చిన వైద్యనాథన్

Telugu Lo Computer
0


ఐసీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండి, సీఈఓ వైద్యనాథన్ తన పేరు మీదున్న రూ.3.95 కోట్ల విలువైన 9 లక్షల షేర్లను ఫ్రీగా ఇచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు తెలిపింది. 3 లక్షల షేర్లను తన ట్రైనర్ రమేశ్ రాజుకు, ఇంటి పనిమనిషి ప్రంజల్ నర్వేకర్, కారు డ్రైవర్ అల్గర్‌స్వామి సి మునపర్‌లకు చెరో 2 లక్షల షేర్లు, ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ దీపక్ పథారే, ఇంటి పనిమనిషి సంతోష్ జొగాలేకు చెరో లక్ష షేర్లను వైద్యనాథన్ బహుమానంగా ఇచ్చినట్లు ఫైలింగ్‌లో పేర్కొంది. అదనంగా, రుక్మణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక కార్యకలాపాలకు మద్దతుగా 2 లక్షల ఈక్విటీ షేర్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో తనకు విధేయులుగా ఉన్న ఇంట్లో పనిచేసే సిబ్బంది, కారు డ్రైవర్‌, జిమ్ డ్రైవర్ తోపాటు స్వచ్ఛంద సంస్థ ఇలా మొత్తం 11 లక్షల ఈక్విటీ షేర్లు వైద్యనాథన్ అందించారు. తద్వారా ఆయన ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల్ని పొందలేదని ఐడీఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)