బీజేపీ అభ్యర్ధికి ఒకే ఒక్క ఓటు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 23 February 2022

బీజేపీ అభ్యర్ధికి ఒకే ఒక్క ఓటు !


తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ సత్తాచాటుకోవడానికి ప్రయత్నించాయి. ఇదే సమయంలో ఊహించని విదంగా బీజేపీ పుంజుకుంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకంటే ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. గతంలో కంటే అధిక సీట్లు కైవసం చేసుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్ సభ, శాసనసభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ నాయకులు ఇక ముందు తమిళనాడులో జరిగే అన్ని ఎన్నికల్లో ఎవరితో పోత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని అంటున్నారు.ఈరోడ్ లోని భవానీసాగర్ పట్టణ పంచాయితీ 11వ వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నరేంద్రన్ కు ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. స్థానిక స్థంసల ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నరేంద్రన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈరోడ్ లో పోటీ చేసిన నరేంద్రన్ వ్యక్తికి ఒకే ఒక్క ఓటు రావడం హాట్ టాపిక్ అయ్యింది. భార్య, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల్లో ఒక్కరు కూడా ఒక్క ఓటే అతనికి వెయ్యకపోవడంతో అతను బిత్తరపోయాడు. నా భార్యతో పాటు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ తనను మోసం చేశారని బీజేపీ లీడర్ నరేంద్రన్ లబోదిబో అంటున్నాడు. ఎవరు ఓటు వేసినా వెయ్యకపోయినా నా ఓటు నాకు పడింది అని నరేంద్రన్ చెప్పాడని స్థానిక మీడియా తెలిపింది. ఎవరు నన్ను ఆధరించినా, ఆదరించకపోయినా వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి పోటీ చేస్తానని నరేంద్రన్ అంటున్నాడు. 

No comments:

Post a Comment