సంత్ రవి దాస్ భజనలో పాల్గొన్న మోదీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 February 2022

సంత్ రవి దాస్ భజనలో పాల్గొన్న మోదీ


సంత్ రవి దాస్ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉన్న ఈ మందిరంలో భక్తులతోపాటు షబద్ కీర్తన్‌లో పాల్గొన్నారు. వారణాసిలోని సంత్ రవిదాస్ జన్మస్థలంలో ఉన్న మందిరం సుందరీకరణ, విస్తరణ పనుల గురించి మీడియా కథనాలను మోదీ ఓ ట్వీట్‌లో జత చేశారు. కాశీ  నుంచి తాను లోక్‌సభ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి తన ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ గురు రవిదాస్ స్ఫూర్తిని ఏ విధంగా ఆచరిస్తున్నదీ వివరించారు. అదేవిధంగా తాను ఢిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరంలో షబద్ కీర్తన్‌లో భక్తులతో కలిసి పాల్గొన్నట్లు ఓ వీడియోను జత చేశారు. ఈ క్షణాలు చాలా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. గురు రవిదాస్ 15వ శతాబ్దానికి చెందినవారు. ఆయన అనుచరులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా దళితులు ఆయన బోధనలను అనుసరిస్తారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లలో ఆయన భక్తులు చాలా మంది ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల నేపథ్యంలోనే పంజాబ్ శాసన సభ ఎన్నికలను ఈ నెల 14 నుంచి ఈ నెల 20కి వాయిదా వేశారు.

No comments:

Post a Comment