ఈ వారంలో సందడిచేయనున్న సినిమాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 February 2022

ఈ వారంలో సందడిచేయనున్న సినిమాలు !


83: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా ’83’. ఈ చిత్రం ఫిబ్రవరి 18న నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లలోకి రానుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది. 2D, 3D ఫార్మాట్‌లలో 24 డిసెంబర్ 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ’83’ ఈ శుక్రవారం ఓటిటిలో రిలీజ్ కానుంది. బంగార్రాజుఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన “బంగార్రాజు”లో నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఫిబ్రవరి 18న ZEE5లో వస్తుంది. థియేటర్లలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు OTTలో విడుదల కానుంది. రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా, నాగార్జున స్వయంగా నిర్మించారు. విశాల్ ‘విలన్’ ఫిబ్రవరి 18న OTTలో ల్యాండ్ అవుతుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 18 నుండి సోనీ లైవ్‌లో ప్రసారం కానుంది. హృదయం : మలయాళ భాషా ప్రేమ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 18 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా కోవిడ్-19 పరిమితులు ఉన్నప్పటికీ కేరళలోని బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది.


No comments:

Post a Comment